VIDEO పేలిన ఎలక్ట్రిక్ బైక్
NEWS Nov 21,2024 12:55 pm
జగిత్యాల మండలం బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. బాలపల్లికి చెందిన భేతి తిరుపతి రెడ్డి 3 నెలల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు చేశారు. తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టాడు. అయితే ఒక్కసారిగా బైక్ బ్యాటరీ పేలి మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసం కాగా బైక్ పూర్తిగా కాలిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది