భర్తకు అధికారిక స్వాగతం!
NEWS Nov 21,2024 03:37 am
వేములవాడ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో నిన్న ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సతీమణి శైలజారామయ్యార్ వచ్చారు. మంత్రులకు అధికారిక స్వాగతం పలికారు. తన భర్త శ్రీధర్ బాబుకు సైతం ఆమె ఫ్లవర్ బొకే ఇచ్చి వెల్కం చెప్పారు. సీఎంకు స్వాగతం పలకగా అన్నా వదిన అంటూ ఆయన నవ్వుతూ వారిని పలకరించారు. ఫొటో బాగా దిగండి అని పొన్నం సైతం నవ్వులు పూయించారు.