Logo
Download our app
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
NEWS   Nov 20,2024 07:00 pm
మాదక ద్రవ్యాలు, మొబైల్ వినియోగం, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం కొత్తగూడెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరంలో నిర్వహించారు. ఇందులో భాగంగా మాదకద్రవ్యాలు,మొబైల్ వినియోగం వాటివల్ల కలిగే దుష్పరిణామాలు టూ టౌన్ ఎస్ఐ షాహినా విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ జరిగితే తక్షణమే 100 లేదా 1930 నంబర్లకు డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సిహెచ్ వెంకటేశ్వరరావు, బుచ్చి రాములు, శ్రీనివాసులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source