వృద్ధుల సంరక్షణ పాలసీపై అవగాహన
NEWS Nov 20,2024 02:19 pm
తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ పోరాట ఫలితంగా కేంద్రప్రభుత్వం వృద్ధుల సంరక్షణ పాలసీని రూపొందించడానికి నిర్ణయించినట్లు సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ తెలిపారు. బుధవారం కోరుట్ల డివిజన్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో వృద్ధుల సంరక్షణ పాలసీపై అవగాహన కల్పించారు. అనంతరం డివిజన్ అసోసియేషన్ రూపొందించిన సీనియర్ సిటిజన్స్ చట్టం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.