8 కాళ్లతో వింత జంతువు జననం
NEWS Nov 20,2024 10:23 am
కడప: చక్రాయపేట మండలం కే.రాజుపల్లె గ్రామంలో బుధవారం ఓ గొర్రెకు 8కాళ్ల వింత జంతువు జన్మించింది. రసూల్‌కు చెందిన గొర్రె ఈ వింత జంతువుకు జన్మనిచ్చింది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లు ఈ వింతలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు.