స్మశానంలో అఘోరీ పూజలు
NEWS Nov 19,2024 03:42 pm
వరంగల్‌లోని ఓ స్మశాన వాటికలో ఒళ్ళు గగుర్పొడిచేలా అఘోరీ పూజలు చేసింది. శవాన్ని దాహనం చేసిన బూడిదంతా తన ఒంటిపై రుద్దుకొని హంగామా చేసింది. చుట్టూ త్రిశూలాలు ఏర్పాటు చేసుకొని అచ్చం హర్రర్ మూవీని తలపించే తరహాలో పూజలు నిర్వహించింది. కోడిని బలిచ్చి రక్తర్పనం చేసింది. గుమ్మడికాయని కోసి విచిత్ర రూపంలో పూజలు నిర్వహించింది. స్థానికులు భయాందోళన చెందారు.