పథకాలపై విస్తృత ప్రచారం: కలెక్టర్
NEWS Nov 19,2024 03:01 pm
కామారెడ్డి: రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తోందని తెలిపారు. ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.