మేయర్ భర్తపై దాడి కేసులో అరెస్ట్
NEWS Nov 19,2024 09:01 am
నిజామాబాద్: మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్‌పై దాడి ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నగరానికి చెందిన షేక్ రసూల్ శేఖర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో నిందితుడిని పట్టుకోడానికి 4 బృందాలతో పోలీసులు గాలించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి నిందితుడు రసూల్ ను అదుపులోకి తీసుకొని మాక్లూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.