Logo
Download our app
కొండగట్టులో భక్తుల రద్దీ
NEWS   Nov 19,2024 04:11 am
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుండే తలనీలాలు సమర్పించుకుని, కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలతో పాటు, అనుబంద ఆలయాల్లో సైతం భక్తుల తాకిడి నెలకొంది. కార్తీక మాసం కావడంతో మహిళలు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source