Logo
Download our app
నిధులు విడుదల చేయాలని వినతి
NEWS   Nov 18,2024 04:06 pm
జగిత్యాల పట్టణంలోని 4వ వార్డుకు చెందిన కౌసర్ మజిదు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రూ.4 లక్షలు విడుదల చేయాలని స్థానిక మైనార్టీ సోదరులతో కలిసి కౌన్సిలర్ క్యాదాసు నవీన్ సోమవారం బల్దియా ఛైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, కమిషనర్ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గతంలో రూ.4 లక్షలు మసీద్ కోసం ప్రతిపాదనలు చేశారని, ఆ నిధులు విడుదల కాలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source