Logo
Download our app
సబర్మతి రిపోర్ట్‌పై మోదీ సంచలన ట్వీట్
NEWS   Nov 18,2024 05:21 am
అసత్య ప్రచారం ఎక్కువ కాలం ఉండదని, ఎప్పటికైనా నిజం బయటపడుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. గోద్రా అల్లర్ల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సబర్మతి రిపోర్ట్’ టీంను మెచ్చుకున్నారు. నిజాన్ని సామాన్యులకు అర్థ‌మ‌య్యేలా చూపించడం మంచి ప్రయత్నమని కొనియాడారు. గోద్రా అల్లర్ల ఇతివృత్తంగా రూపొందించిన సబర్మతి రిపోర్ట్ సినిమా రీసెంట్‌గా విడుదలైంది. గోద్రా రైల్వే స్టేషన్ లో ట్రైన్ కు నిప్పు పెట్టడంతో 59 మంది సజీవదహనం కావడం, దీంతో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడం తదితర సంఘటనలను ఇందులో చూపించారు. మోదీ అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్నారు. గోద్రా ఘటనతో గుజరాత్ లో చెలరేగిన హింస వల్ల దాదాపుగా వెయ్యి మందికి పైగా హత్యకు గురయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source