ఇసుక డంపుల స్వాధీనం
NEWS Nov 18,2024 04:57 am
మల్లాపూర్ మండలం సాతారంలో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంపులను స్వాధీనపరచుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి సమయంలో సాతారం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యక్తులు పారిపోగా ఇసుక డంపులను స్వాధీన పరచుకుని రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.