ఎండు గంజాయి పట్టివేత
NEWS Nov 17,2024 04:28 am
కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ శివారులో దేవునిపల్లి ఎస్సై రాజు ఎండు గంజాయి పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టగా.. ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారించగా వారి వద్ద 110 గ్రాముల గంజాయి లభించిందని ఎస్సై తెలిపారు. వీరి నుంచి మూడు సెల్ ఫోన్లు, ఒక బైక్, రూ. 700 నగదు సీజ్ చేశామన్నారు. పట్టుబడిన వ్యక్తులను యూపీకి చెందిన వారిగా గుర్తించామని చెప్పారు.