Logo
Download our app
వాల్గొండలో ఘనంగా లక్ష దీపోత్సవం
NEWS   Nov 15,2024 03:58 pm
మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తిక శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని వేద పండితులు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ ఆకృతులలో దీపాలు వెలిగించారు. దీపాల వెలుగులో గుడి ఆవరణమంతా దేదీపమాణ్యంగా వెలిగిపోయింది. అనంతరం అఖండ దీపం వెలిగించి, దీపస్తంభ స్థాపన, మహా హారతి, తీర్థప్రసాద వితరణ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source