ధాన్యం తూకంలో అలసత్వం వద్దు
NEWS Nov 15,2024 02:43 pm
కోరుట్ల: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ధాన్యం తూకం విషయంలో నిర్వాహకులు అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు.