Logo
Download our app
మాజీ సర్పంచ్ భర్తపై అట్రాసిటీ కేసు
NEWS   Nov 15,2024 07:39 am
ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన సున్నం సత్యంపై అట్రాసిటీ కేసు నమోదు అయినట్లు మెట్‌పల్లి డీఎస్పీ ఏ.రాములు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వేములకుర్తి గ్రామానికి చెందిన లక్ష్మీపై మాజీ సర్పంచ్ భర్త సున్నం సత్యం అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తన ఇంటిపై దాడి చేశాడని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గురువారం వేములకుర్తిలో విచారణ చేపట్టి సున్నం సత్యంపై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source