Logo
Download our app
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట
NEWS   Nov 14,2024 04:27 pm
మల్యాల మండలం తక్కళ్లపల్లిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఏడీఈ మహేందర్ మాట్లాడుతూ.. మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని, ISI మోటార్లు వినియోగించాలని అన్నారు. విద్యుత్ కు సంబంధించిన సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కాల్ చేసి తెలపాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్యాల ఏఈ దయానంద్, విద్యుత్ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source