Logo
Download our app
వైభవంగా బాలల దినోత్సవ వేడుకలు
NEWS   Nov 14,2024 01:18 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని అక్షర హైస్కూల్‌లో బాలల దినోత్సవం సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంస్కృతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయకుడి వేషధారణ, తెలంగాణ తల్లి,నెహ్రూ, పచ్చదనం, పరిశుభ్రత సామాజిక అంశాలపై చిన్నారుల‌ వేషాలు పలువురుని ఆకట్టుకున్నాయి, నేటి పిల్లలు రేపటి పౌరులుగా ఎదగాలని పిల్లల ఆలోచన విధానం చిన్న వయసులోనే గొప్పగా ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source