గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
NEWS Nov 13,2024 05:20 pm
మెట్‌పల్లి పట్టణానికి చెందిన కోడూరి రఘువీర్ గౌడ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుధవారం వేకువ జమున గుండెపోటుతో మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన చింతలపేట గ్రామంలో యుపిఎస్ పాఠశాలలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు తదితరులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలను గురువారం నిర్వహించనున్నారు.