విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో సుగవాసి
NEWS Nov 13,2024 05:36 pm
సుండుపల్లి: సుండుపల్లి మండలంలోని మాచిరెడ్డిగారిపల్లి గ్రామం కటారుముడుకులో బుధవారం శ్రీ వరసిద్దివినాయక స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాజంపేట టీడీపీ ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెరగాలి అని సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు