విధుల్లోకి మండల పశు వైద్యాధికారి
NEWS Nov 13,2024 10:41 am
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారిగా జంపాల రాహుల్ పూర్తిస్థాయి మండల పశు వైద్యాధికారిగా విధుల్లో చేరారు. రాహుల్ 2015-20 వరకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ 2020-22 వరకు మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పివి నరసింహరావ్ వెటర్నరీ యూనివర్సిటీలో పశు వైద్య శాస్త్రం పూర్తి చేశారు. ఇంచార్జీ పశు వైద్యాధికారిగా పనిచేసిన రేణుక పూర్తిస్థాయి పశు వైద్యాధికారిగా మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామ పశు వైద్యాధికారిగా విధులు నిర్వహించనున్నారు.