పాదయాత్ర ఎందుకు..అంటూ ఫ్లెక్సీ
NEWS Nov 13,2024 05:19 am
కోరుట్ల ఎమ్మెల్యే గారు మీ పాదయాత్ర ఎందుకు? అంటూ కాంగ్రెస్ నాయకుడు చెన్నమనేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ని ఉద్దేశించి కోరుట్ల పట్టణంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసి వేయించినందుకా? కొండ్రికర్లలో బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చి నిర్మించలేక పోయినందుకా? పదేళ్లుగా గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వక సర్పంచుల ఆత్మహత్యకు కారణమైనందుకా? అంటూ ఫ్లెక్సీని రూపొందించారు.