Logo
Download our app
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు!
NEWS   Nov 12,2024 10:04 am
దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి. నేడు హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,290కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 70,850 ఉంది. ఇక‌ హైదరాబాద్ నగరంలో కిలో వెండి ఒక లక్ష రూపాయలకు లభిస్తోంది. ఈ నెల ఆరంభం నుంచి చూస్తే సిల్వర్ రేటు బాగా పడిపోయింది. కిలోకు దాదాపు రూ. 6 వేలు తగ్గింది. బంగారం, వెండి ధరల్లో ఈ కదలికలు చూసి పెట్టుబడికి ఇదే సరైన సమయమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source