Logo
Download our app
BRS మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
NEWS   Nov 12,2024 08:11 am
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయ‌గా, నేడు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా నోటీసులు అందుకున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో లభించిన క్లూస్ ద్వారా వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source