Logo
Download our app
కిటకిటలాడుతున్న అంజన్న క్షేత్రం
NEWS   Nov 12,2024 08:16 am
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని కార్తీక మాసం నేపథ్యంలో మంగళవారం సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వేకువజాం నుండే అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ ప్రధాన ద్వారం ముందర ఉన్న రావి చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి, స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అందరిని చల్లగా చూడు అంజన్న అంటూ భక్తులు స్వామివారిని వేడుకుంటున్నారు.
⚠️ You are not allowed to copy content or view source