Logo
Download our app
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్
NEWS   Nov 12,2024 06:19 am
అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మంగళవారం చేపట్టిన పాదయాత్ర ను ప్రారంభించడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రావడం లేదని, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ చెల్లించడం లేదని ఆరోపించారు. సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తదితరులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source