Logo
Download our app
ఫ‌స్ట్‌టైం 82,000 డాలర్లు దాటిన బిట్‌కాయిన్
NEWS   Nov 11,2024 02:52 pm
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలుపొందడం క్రిప్టో మార్కెట్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. ముఖ్యంగా ట్రంప్ డిజిటల్ ఆస్తులకు మద్దతుగా హామీ ఇవ్వడం, క్రిప్టో మార్కెట్ అనుకూల నిర్ణయాలను ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మేజర్ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ తొలిసారిగా 82,000 డాలర్లను అధిగమించి, సోమవారం నాటికి 82,300 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బిట్‌కాయింట్ 90 శాతం పుంజుకుంది.
⚠️ You are not allowed to copy content or view source