కొమిరెడ్డి జ్యోతి అంత్యక్రియల్లో సుజిత్ రావు
NEWS Nov 10,2024 01:04 pm
మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి పార్థివదేహానికి టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు నివాళులర్పించారు. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చేసిన సేవలను కొనియాడారు.