Logo
Download our app
ఏపీ, తెలంగాణ మధ్య మ‌ళ్లీ సాగర్ వివాదం
NEWS   Nov 09,2024 10:53 am
ఏపీ, తెలంగాణ మధ్య మ‌ళ్లీ నాగార్జున సాగర్ వివాదం రాజుకుంది. గత ఏడాది నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రోజున నాగార్జున సాగర్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్నది. మళ్లీ నవంబర్‌లోనే సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి కుడి కాల్వ వాటర్‌ రీడింగ్‌ నమోదు వివాదానికి దారితీసింది. వాటర్ రీడింగ్ తీసేందుకు తెలంగాణ అధికారులు ప్రయత్నించారు. వీరిని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
⚠️ You are not allowed to copy content or view source