యాగంటి ఆలయంలో మహిళా అఘోరీ
NEWS Nov 09,2024 07:46 am
మహిళా అఘోరి యాగంటి ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. అంతకుముందు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి దర్శనానికి వెళుతుండగా అధికారులు అడ్డుకొనగా.. ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత విశాఖ నాగక్షేత్రం పీఠాధిపతి ఆమెను శరీరంపై ఎర్రటి దుస్తులు ధరించమని చెప్పారు. ఆ తరువాత ఆమె స్వామిని దర్శించుకుని యాగంటికి వెళ్లారు. యాగంటి క్షేత్రంలో దర్శనం తరువాత ..మహానందికి వెళ్లినట్లు తెలుస్తోంది.