Logo
Download our app
కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మండలాధ్యక్షుడిగా రవిశంకర్
NEWS   Nov 09,2024 07:57 am
మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన కనుకుంట్ల రవిశంకర్ ను మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షడిగా నియమిస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ మారుతి బాపూజీ శుక్రవారం నియామక పత్రం అందజేశారు. గతంలో రవిశంకర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తిస్తూ ఈ నియామకం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source