Logo
Download our app
రేపు కొమిరెడ్డి జ్యోతి అంత్యక్రియలు
NEWS   Nov 09,2024 06:43 am
బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి అంత్యక్రియలను ఆదివారం మెట్‌ప‌ల్లిలో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆమె పార్థివదేహాన్ని ప్రత్యేక చార్టెర్డ్ విమానంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి శనివారం సాయంత్రం చేరుకోనుంది. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా రాత్రి వరకు మెట్‌ప‌ల్లి చేరుకుంటుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source