భావిభారత పౌరులకు ఆదర్శం వండర్ కిడ్ విశ్వామిత్ర చౌహన్
NEWS Nov 08,2024 06:51 pm
పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిఏచ్ఎస్ చుంచుపల్లి బయో సైన్స్ ఎస్.ఎ. జితేందర్, 10వ తరగతి విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో ఎర్రచందనం మొక్కను ప్రకృతి ప్రేమికుడు, చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ నాటారు. మొక్కలు నాటడం దైనందిన చర్యగా చేసుకొని చిరు ప్రాయంలోనే సమాజ స్పృహ కలిగి మొక్కలను నాటుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిస్తూ పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా మొక్కలు నాటుతున్న చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ భావితరాలకు ఆదర్శమని ఆయన అన్నారు.