Logo
Download our app
మూసీ ప్రాజెక్టును పూర్తి చేస్తా: రేవంత్
NEWS   Nov 08,2024 01:18 pm
సంగెం శివయ్య సాక్షిగా చెబుతున్నా, మూసీ నది ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ పునరుజ్జీవ యాత్ర సందర్భంగా సీఎం సంగెంలో శివుడికి పూజలు చేసి, అక్క‌డి నుంచి నాగిరెడ్డిపల్లి వరకు యాత్ర నిర్వహించారు. ధర్మారెడ్డి కాలువ వెంట 2.5 కిలోమీటర్ల యాత్ర చేశారు. మూసీ వల్ల హైదరాబాద్ పరిస్థితి అణుబాంబు పడిన ప్రాంతం కంటే దారుణంగా మారిందన్నారు. ఈ అణుబాంబు ఆటంబాంబుగా మారకముందే మనం జాగ్రత్తపడాల్సి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోపిడీ చేసినవారు ఇప్పుడు తనను మూసీ ప్రాజెక్టుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడం విడ్డూరమన్నారు.
⚠️ You are not allowed to copy content or view source