రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
NEWS Nov 08,2024 01:07 pm
మెట్‌పల్లి పట్టణంలో రేపు (శనివారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ రవి తెలిపారు. సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ దృష్ట్యా క్లబ్, కళానగర్, దోబీఘాట్, రాంనగర్, ఆదర్శనగర్, సంఘం ఆసుపత్రి, అయ్యప్ప, బ్రూక్లీన్ స్కూల్, టీచర్స్ కాలనీ, డిడి నగర్, రబ్బానిపురా, కుంట్ల, వాటర్ ట్యాంక్, DCMS, కొత్త బస్టాండ్, KDCC బ్యాంక్, బాలకృష్ణ నగర్, దుబ్బవాడ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.