ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWS Nov 08,2024 01:08 pm
మల్లాపూర్ మండలంలోని వాల్గొండ, వెంపల్లి, వెంకట్రావుపేట గ్రామాలలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ వంతడపుల పుష్పలత నర్సయ్య బుధవారం ప్రారబించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమం లో రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.