కార్యకర్తల సంక్షేమం కోసమే పార్టీ సభ్యత్వం
NEWS Nov 08,2024 06:53 pm
ప్రొద్దుటూరు: కార్యకర్తల సంక్షేమం కోసమే తెలుగుదేశంపార్టీ సభ్యత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రొద్దుటూరు TDP బీసీ నాయకులు చల్లా రాజగోపాల్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రొద్దుటూరు లోని స్థానిక 13 వ వార్డు నందు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి TDP సభ్యత్వం వల్ల ఉండే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. TDP యువనాయకుడు బచ్చల వీరప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.