Logo
Download our app
పోలీస్ అధికారి పేరుతో వ్యక్తికి బెదిరింపు కాల్
NEWS   Nov 08,2024 03:42 pm
మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన లచ్చిరెడ్డికి గురువారం పోలీసు ఉన్నతాధికారినంటూ బెదిరింపు కాల్ వచ్చింది. USలో ఉంటున్న మీ కుమారుడు ఓ నేరానికి పాల్పడ్డాడని, అరెస్టు చేసి తీసుకెళ్తున్నట్టు, రూ.50వేలు పంపిస్తే వదిలిపెడతామని బెదిరించాడు. అయితే వాస్తవానికి లచ్చిరెడ్డి కొడుకు USలో కాకుండా సింగపూర్ లో జాబు చేస్తూ ఇటీవలే ఇంటికి వచ్చాడు. పోలీసు అధికారి ఫోటోతో వచ్చిన ఫోన్ కాల్ ఫేక్ అని తెలియడంతో లచ్చిరెడ్డి భయపడకుండా సమాధానం ఇచ్చి, కాల్ కట్ చేసినట్లు పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source