తక్కలపల్లి గ్రామంలో కుక్కల బెడద
NEWS Nov 07,2024 04:50 pm
కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామంలో కుక్కలు నడిరోడ్లపై తిరుగుతూ బండి మీద ప్రయాణం చేసే వారి వెంటపడుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే గ్రామ ప్రజలను స్కూలు పిల్లలను కుక్కలు కరవడం వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై విషయమై గ్రామ కార్యదర్శికి విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు వాపోతున్నారు.