కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
NEWS Nov 08,2024 06:48 pm
రాయచోటి: బదిలీలతో పోలీస్ అధికారులలో మనోస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైసీపీ కార్యాలయంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం వాటిని ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని అన్నారు.