హైదరాబాద్‌లో భారీ ఎన్టీఆర్ విగ్రహం
NEWS Nov 06,2024 10:01 am
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన చోటే విగ్రహం ఆవిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భూమి ఇచ్చిన తరువాత విగ్రహావిష్కరణ జరుగుతుందన్నారు. విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను టీడీపీ నేతలు కలిసినట్లు సమాచారం.