పరువు నష్టం దావా వేస్తా: విజయమ్మ
NEWS Nov 05,2024 05:40 pm
జగన్, షర్మిల, ఆస్తుల వివాదం, తనపై హత్యకు కుట్ర వంటి అంశాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ స్పందించారు. తనపై తన కొడుకు వైఎస్ జగన్ హత్యా ప్రయత్నం చేశాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చని, అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా? అని విజయమ్మ ప్రశ్నించారు. ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని విజయమ్మ హెచ్చరించారు.