Logo
Download our app
బీడీ కార్మికులకు షరతుల్లేకుండా రూ. 4016 జీవన భృతి ఇవ్వాలి
NEWS   Nov 05,2024 05:24 pm
KMR: కాంగ్రెస్‌ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 4,016 జీవన భృతి ఇవ్వాలని బీఎల్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య పేర్కొన్నారు. మంగళవారం రాజంపేట మండలం పొందుర్తిలో బీడీ కార్మికుల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 7న రాజంపేట తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు తరలిరావాలన్నారు. షరతుల్లేకుండా బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source