మొబైల్ షాప్‌లో దొంగతనం
NEWS Nov 05,2024 07:12 am
జగిత్యాల పట్టణలోని గాయత్రి మొబైల్స్‌లో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. వెంటిలేషన్ నుండి చొరబడి చోరీకి పాల్పడినట్లు సమాచారం. దాదాపు రూ. 2 లక్షల విలువగల ఫోన్ లను, నగదును దొంగిలించారు. పోలీసులు, క్లూజ్ టీం సంఘటన స్థలానికి వచ్చి విచారణ జరుపుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.