మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్
NEWS Nov 05,2024 05:06 am
విజయవాడలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు మంత్రికి తమ సమస్యలతో వినతి పత్రాలు సమర్పించారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.