Logo
Download our app
కూన అశోకుని సన్మానించిన ప్రభుత్వ విప్
NEWS   Nov 04,2024 03:36 pm
కథలాపూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎన్నికైన కూన అశోక్‌ని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శీను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీను మాట్లాడుతూ.. మండలంలో ప్రభుత్వ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే పనిలో నిమగ్నం కావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ప‌నుల‌ను, ప‌థ‌కాల‌ను ప్రజలకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేసే భాగంలో అశోక్ ముందున్నాడని కొనియాడారు. మండల అధ్యక్షులు నాగరాజ్, బ్లాక్ కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source