Logo
Download our app
మెరుగైన వైద్యసేవలు అందించడానికి కృషి
NEWS   Nov 04,2024 11:04 am
మైలవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి,రోగులకు అత్యున్నత స్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించడానికి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని మైలవరం MLA వసంత కృష్ణప్రసాదు కోరారు. మైలవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చారుగండ్ల ప్రసాద్, డైరెక్టర్లుగా జెల్లి కృష్ణ, షేక్ షేహనాజ్ బేగం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎంఎల్ఏ సమక్షంలో ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమం మైలవరంలోని ప్రభుత్వాసుపత్రిలో జరిగింది.
⚠️ You are not allowed to copy content or view source