మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి ఇది..
NEWS Nov 04,2024 08:49 am
మెట్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన బాధితుడికి.. ఫోన్‌లో సలహాలు వింటూ నర్సు చికిత్స చేస్తున్న పరిస్థితి. ఆదివారం రాత్రి ఆరపేట బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సు ఫోన్ ద్వారా సలహాలు వింటూ చికిత్స చేశారు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు చివరికి బాధితుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.