మాజీ సర్పంచ్ ల ముందుస్తు అరెస్ట్
NEWS Nov 04,2024 07:16 am
మల్లాపూర్ మండల మాజీ సర్పంచులను ముందస్తు అరెస్టు చేసి మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపు నిచ్చిన తరుణంలో వారిని ముందస్తు అరెస్ట్ చేసారు.పోలీసుల చర్యలను మాజీ సర్పంచ్ లు ఖండించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.