Logo
Download our app
కార్తీక మాసం: లింబాద్రి గుట్టపై గిరి ప్రదక్షిణ
NEWS   Nov 03,2024 11:45 am
భీమ్ గల్: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భీమ్ గల్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి గుట్టపై భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయాన్నే యువకులు, మహిళలు భారీ సంఖ్యలో గుట్టపైకి కాలినడకన చేరుకొని గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. దీంతో కొండ ప్రాంతం గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. ఈనెల 7 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతర, రథోత్సవం నిర్వహించనున్నారు. దక్షిణ బద్రీనాథ్ గా లింబాద్రి గుట్టకు పేరుంది.
⚠️ You are not allowed to copy content or view source